61. మామయైనగాని డ్రామాలు కుదరవు
కంసుడైన మట్టి గరచినాడు
బెయిలు తీసుకోక బయలు కొచ్చినవాడ
గీతదాత నీరు కేలుమోడ్తు
62. మృదుమధురమునయిన యదుకుల సుందరు
మాటలందు తేనెతేట కలదు
రాజనీతి తోడ రాణకెక్కినవాడ
గీతదాత నీకు కేలుమోడ్తు
63. కేశవుండవీవు క్లేశముల్ పోగొట్టి
ఆదుకొనేడువాడ ఆర్తజనులు
వేడుకున్న చాలు గోడుతొలగు కదా!
గీతదాత నీకు కేలుమోడ్తు