49. అష్టమి తిథి పుట్టి అష్టకష్టములను
అనుభవించినట్టి ఆగ్రగణ్య
ఇహపరమ్ములకును ఇష్ట దైవము నీవె
గీతదాత నీకు కేలుమోడ్తు
50. పలుకుపలుకులోన చిలుకునమృతధార
హృదయమందు దయయు హెచ్చుగాను
పూర్ణపురుషుడవయ పుణ్య దేవుండవు
గీతదాత నీకు కేలుమోడ్తు
51. మెత్తపయినవాడ మేనత్త రాధతో
జంట కలిపినట్టి సరసుడవయ
ప్రణయగాధలందు పండితోత్తముడవు
గీతదాత నీకు కేలుమోడ్తు