Krishna | బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయండి

Krishna | బుద్ధ ప్రాజెక్టు పూర్తి చేయండి
- మంత్రికి విన్నవించిన భంతే దమ్మ ధజ థెరో
Krishna | కృష్ణా బ్యూరో, ఆంధ్రప్రభ : గోదావరి పుష్కరాల్లోపు ఘంటసాల గ్రామంలో అసంపూర్తిగా ఉన్న బుద్ధ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఘంటసాల అమరావతి బుద్ధ విహార్ భంతే దమ్మ ధజ థెరో మంత్రి కందుల దుర్గేష్ ను కోరారు. రాజమండ్రిలో ఏపీ టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ కార్యాలయంలో దమ్మ దజ థెరో ఈ రోజు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి దుర్గేష్ చేతులు మీదగా సద్ధమ్మ ఉపాసత క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
అనంతరం ఘంటసాలలో నిర్మిస్తున్న 100 అడుగుల సింహాశయన బుద్ధ భగవానుల ప్రాజెక్ట్ గురించి చర్చించారు. ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని చెప్పి గోదావరి పుష్కరాలకు ముందే పూర్తి చేసేందుకు కృషి చేయాలని మంత్రి దుర్గేష్ ను కోరినట్లు బంతేజీ తెలిపారు. ముందుగా మంత్రి దుర్గేష్ కు బంతేజీ పంచశీల కండువా కప్పి బుద్ధుని ఆశీస్సులు అందించారు.
