KRISHNA | బస్వాపూర్ అభివృద్ధే లక్ష్యం….

KRISHNA | బస్వాపూర్ అభివృద్ధే లక్ష్యం….


KRISHNA | బిక్కనూర్, ఆంధ్రప్రభ : మండలంలోని బస్వాపూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సర్పంచ్ అభ్యర్థి కృష్ణ అన్నారు. గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ బాల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు.

జిల్లాలో గ్రామాన్ని అన్ని రంగాల్లో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. పలు కుల సంఘాల యువకులు ఆయనకు అండగా నిలుస్తున్నారు. గ్రామంలో నిర్వహిస్తున్న వినూత్న ప్రచారానికి విశేష స్పందన లభిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో తాను ఎన్నికల బరిలో దిగినట్లు చెప్పారు. మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆశీస్సులతో తమను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గ్రామ సర్పంచిగా గెలిపిస్తామని ఓటర్లు హామీ ఇస్తున్నారు.

Leave a Reply