స్వప్న అశోక్ తోనే కొయ్యలగూడెం గ్రామ అభివృద్ధి..

చౌటుప్పల్, ఆంధ్రప్రభ : చౌటుప్పల్ మండలంలోని కొయ్యలగూడెం గ్రామంలో బిజెపి బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి కైరం కొండ స్వప్న అశోక్ గెలుపుతోనే ప్రజల సమస్యలు పరిష్కారమై గ్రామం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి తెలిపారు.
స్వప్న అశోక్ తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ… గ్రామస్తులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులను విడుదల చేస్తున్నందున, గ్రామంలోని సమస్యలను పరిష్కరించి కొయ్యలగూడెం గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర, కేంద్ర మంత్రుల సహకారంతో అధిక నిధులను తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
ప్రజాసేవే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తున్న స్వప్న అశోక్ ను సర్పంచ్ గా గెలిపించేందుకు, కేటాయించిన ఉంగరం గుర్తుపై పార్టీలకు అతీతంగా గ్రామస్తులు పెద్ద ఎత్తున ఓట్లు వేసి గెలిపించాలని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు.
స్వప్న అశోక్ మాట్లాడుతూ, సర్పంచ్‌గా గెలవగానే ప్రజలకు అందుబాటులో ఉండి గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆయన, ఉంగరం గుర్తుపై పెద్ద ఎత్తున ఓట్లు వేసి సర్పంచ్‌గా గెలిపించమని గ్రామస్తులను కోరారు. ఈ ప్రచారంలో పార్టీ నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
