కోరుట్ల – వినాయకుడి విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్ తీగలు తగిలి షాక్ ఇద్దరు మరణించారు.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి.. జగిత్యాల (Jagityal) జిల్లాలోని కోరుట్ల (Korutla) పట్టణ శివారు ప్రాంతంలో ఉన్న గణేష్ విగ్రహాలు(Ganesh Idols ) తయారు చేసే షెడ్‌లో క్రేన్ (Crane ) ద్వారా విగ్రహాలు తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రేన్ చివరి భాగం ప్రమాదవశాత్తు పక్కనే ఉన్న హైటెన్షన్ వైర్లను తాకాయి. దీంతో మొత్తం తొమ్మిది మందికి కరెంట్ షాక్ (power shock ) తగిలి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హుటాహుటిన జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందగా.. మరో ఏడుగురికి చికిత్స కొనసాగిస్తున్నారు..
