Koregaon Vijay Diwas | ఘ‌నంగా భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్

Koregaon Vijay Diwas | ఘ‌నంగా భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్

Koregaon Vijay Diwas | ముధోల్, ఆంధ్రప్రభ : మండల కేంద్రమైన ముధోల్లోని యశ్వంత్ నగర్‌లో భీమా కోరేగావ్‌ విజయ్‌ దివస్‌(Koregaon Vijay Diwas)ను ఈ రోజు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా భీమ్ సైనిక్ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భీమా కోరేగావ్‌లో 1818 జనవరి 1న జరిగిన యుద్ధంలో వీరమరణం పొంది అమరులైన మహార్‌ సైనికుల ధైర్య సాహసాలను గుర్తుచేస్తూ స్తూపం వద్ద నివాళులర్పించారు.

ఈ సందర్భంగా సోన్ కాంబ్లె గంగాధర్ మాట్లాడుతూ.. కుల వ్యవస్థ దుర్మార్గపు అణచివేత, వివక్ష, అంటరాని తనం నుంచి విముక్తి పొందడానికి మహార్ పీడిత కులానికి చెందిన ఐదు వందలమంది సైనికులు 1818 జనవరి ఒకటవ తేదీ నాడు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా(British East India) కంపెనీ తరఫున పీష్వా సైన్యంతో భీమానది ఒడ్డున వీరోచితంగా పోరాడి విజయం సాధించారని వివరించారు.

రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తేదీన బీమా కోరేగావ్ స్థూపానికి సందర్శించి నివాళులర్పించే వాళ్ళని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తులసీరామ్, బీమ్ సైనిక్ యూత్ సభ్యులు, శ్యామ్ రావు, పండు, సంజు, గౌతమ్, సంజయ్, యువకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply