Kondal Reddy | గెలిపించండి.. సేవకుడిలా పని చేస్తా

Kondal Reddy | గెలిపించండి.. సేవకుడిలా పని చేస్తా

కల్వకుంట సర్పంచ్ అభ్యర్థి అందే కొండల్ రెడ్డి

Kondal Reddy | నిజాంపేట, ఆంధ్రప్రభ : స‌ర్పంచ్‌గా గెలిపిస్తే సేవ‌కుడిలా ప‌ని చేస్తాన‌ని కల్వకుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన అందే కొండల్ రెడ్డి తెలిపారు. ఆయ‌న 13 ఏళ్లుగా గ్రామానికి ఎన్నో స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యమ సమయంలో యువతను ఏక‌తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ సాధనలో తన వంతు పాత్ర పోషించిన నాయకుడు. గ్రామంలో దాదాపు అన్ని వార్డుల్లో సీసీ రోడ్లు వేసేందుకు తన వంతు కృషి చేయడం, అలాగే కల్వకుంట క్రాస్ రోడ్డు వరకు గల బీటీ రోడ్డును డబుల్ రోడ్డుగా వేయించి… క్రాస్ రోడ్ సమీపంలో ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని సొంత డబ్బులతో బస్టాప్ నిర్మాణం చేపట్టి తనదైన శైలిలో ముద్ర వేసుకున్నారు. గ్రామంలో ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా తన సొంత వాటర్ ట్యాంకర్ ద్వారా నీటిని సరఫరా చేయించాడు. కరోనా సమయంలో బాధితులకు అండగా నిలిచి సొంత డబ్బులతో వారికి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. నిరుపేదల వివాహాలకు సహాయం చేశాడు.

Leave a Reply