Komatireddy | ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఆంధ్రప్రభ

Komatireddy | ప్రజలకు ప్రభుత్వానికి వారధి ఆంధ్రప్రభ
- మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
Komatireddy | నల్గొండ, ఆంధ్రప్రభ : ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ అక్షర సత్యాలను కథనాలు రాసే పత్రిక ఆంధ్రప్రభ దినపత్రిక అని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ పట్టణంలో పల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి హైదరాబాద్ రోడ్డు వీటి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఆంధ్రప్రభ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆంధ్రప్రభ దినపత్రిక ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొంటూ తమ కలంతో గొప్ప గొప్ప కథనాలు రాస్తూ పాఠకుల మనసును దోసుకుంటున్న పత్రిక అని పేర్కొన్నారు.
నాటి నుండి నేటి వరకు మంచి ఆదరణ పొందుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో తనదైన ముద్ర వేసుకుంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను పేదలకు సక్రమంగా చేరేందుకు ఆంధ్రప్రభ కథనాలు ఎంతో దోహదపడుతున్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ పట్టణ పార్టీ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, కోమటిరెడ్డి ప్రతిక్ ఫౌండేషన్ చైర్మన్ గోనరెడ్డి, నల్గొండ పిసి ఇన్చార్జి ఉయ్యాల లింగయ్య గౌడ్, జిల్లా ఫోటోగ్రాఫర్ నగారా భాస్కర్, నల్గొండ మండలం రూరల్ రిపోర్టర్ చిక్కుల యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.
