Komati Reddy | టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించం..

Komati Reddy | టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించం..

  • మంత్రి కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

Komati Reddy | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : టెండర్లలో స్కామ్ జరిగితే ఉపేక్షించమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బొగ్గు టెండ‌ర్ల‌పై మంత్రి కోమ‌టిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ… కేంద్రం సింగ‌రేణి బొగ్గు టెండ‌ర్ల‌ను ర‌ద్దు చేయ‌లేద‌న్నారు. టెండర్ల రద్దుపై విచారణకు సిద్ధమన్నారు.

కిషన్ రెడ్డి లేఖ రాస్తే.. దగ్గరుండి విచారణ జరిపిస్తానన్నారు. తన సోదరుల కంపెనీలతో తనకు సంబంధం లేదన్నారు. తనకు ఏ కంపెనీలో వాటా లేదన్నారు. తనకు డబ్బులే కావాలనుకుంటే మంత్రి పదవికి ఎందుకు రాజీనామా చేస్తా..? అని అన్నారు. మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో ల‌బ్ధి కోస‌మే బీఆర్ఎస్ దుష్ప్ర‌చారం చేస్తోంద‌న్నారు.

Leave a Reply