Champions Trophy Finals | క్రిస్ గేల్ రికార్డుపై గురిపెట్టిన‌ కోహ్లీ !

ఛాంపియన్స్ ట్రోఫీ తుదిపోరులో టీమిండియా ర‌న్ మెషీన్ విరాట్ కోహ్లీని మ‌రో రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో కోహ్లీ పెద్ద చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గేల్… కానీ కోహ్లీ ఆ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు.

ఛాంపియన్స్ ట్రోఫీలో టాప్ స్కోరర్‌గా ఉన్న క్రిస్ గేల్.. 17 మ్యాచ్‌ల్లో 791 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి.

కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ మొత్తం 17 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 746 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈరోజు కివీస్ పై జ‌రుగుతున్న పోరులో 252 ప‌రుగుల ల‌క్ష్యంతో టీమిండియా బ‌రిలోకి దిగ‌నుంది. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ 45 రన్స్ చేస్తే వెస్టిండీస్ బ్యాటర్ క్రిస్ గేల్ రికార్డు బ్రేక్ అవుతుంది.

ర‌చిన్ తో పోటీ..

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో జాబితాలో ప్ర‌స్తుతం విరాట్ కోహ్లీ నాల్గవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ 4 మ్యాచ్‌ల్లో 217 పరుగులు చేశాడు. ఇందులో 1 సెంచరీ, 1 హాఫ్ సెంచరీ ఉన్నాయి.

మొదటి స్థానంలో ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ డకెట్ 226, న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర 226 పరుగులతో ఉన్నాడు. మూడో స్థానంలో జో రూట్ వుండగా, అతను 225 రన్స్ చేశారు.

అయితే, ఇప్పుడు బెన్ డకెట్, జో రూట్ ప్రస్తుతం ఛాంపియన్స్ ట్రోఫీలో లేరు. దీంతో భారత రన్ మిషన్ విరాట్ కోహ్లీ, న్యూజిలాండ్ యంగ్ ప్లేయర్ రచిన్ రవీంద్రకు మధ్య పోటీ ఉంటుంది.

స‌చిన్ రికార్డుపై క‌న్నేసిన కోహ్లీ..

ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే, న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొడతాడు.

సచిన్ టెండూల్కర్ 41 ఇన్నింగ్స్‌లలో 1,760 పరుగులు చేశాడు, వాటిలో ఐదు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 32 ఇన్నింగ్స్‌లలో కోహ్లీ ఆరు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు సహా 1,656 పరుగులు చేశాడు.

అయితే, మొత్తంగా అగ్రస్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 50 ఇన్నింగ్స్‌లలో 1,971 పరుగులు చేశాడు, ఇందులో ఆరు సెంచరీలు, 12 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *