అసెంబ్లీ రూల్స్ తెలుసుకోండి
- 60 రోజులు రాకపోతే అనర్హులే..
- ఏపీ ఉప సభాపతి రఘురామకృష్ణంరాజు
భీమవరం, ఆంధ్రప్రభ బ్యూరో : అసెంబ్లీ రూల్స్ తెలుసుకొని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former CM Jagan Mohan Reddy), వైసీపీ నాయకులు మాట్లాడాలని ఏపీ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు(Kanumuru Raghuramakrishnam Raju) సూచించారు. అసెంబ్లీకి రాకుంటే అనర్హులవుతారనే రూల్ ఉందా అని తనను కొందరు అడుగుతున్నారని దీనిపై స్పష్టత ఇచ్చేందుకు తాను మాట్లాడుతున్నట్లు ఆదివారం నిర్వహించిన మీడియా(media) సమావేశంలో రఘురామకృష్ణంరాజు తెలిపారు.
ఆయన మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి జగన్ ఎంపీగా, గతంలో ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పని చేసి అసెంబ్లీ రూల్స్(assembly rules) తెలుసుకోకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు. భారత రాజ్యాంగంలోని 190 (4) అధికరణం ప్రకారం ఒక రాష్ట్ర శాసనసభ సభ్యుడు సభ అనుమతి లేకుండా 60 రోజుల పాటు అన్నిసమావేశాలకు గైర్హాజరైతే(absenteeism) ఆ స్థానాన్నిఖాళీగా ప్రకటించవచ్చన్నారు.
భారత రాజ్యాంగంలో 190(4) చాలా స్పష్టంగా ఉందని అన్నారు. ఎవరైనా లీవ్ ఆఫ్ ఆప్షన్(Leave of Option) అడగకుండా కంటిన్యూస్ గా 60 రోజుల పాటు సమావేశాలకు హజరు కాకపోతే శాసనసభ సభ్యత్వానికి, పార్లమెంటు(Parliament) సభ్యత్వానికి అనర్హులగా గుర్తిస్తారు, అని ఉప సభాపతి వివరించారు. అది అసెంబ్లీకి 187 (2) రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కాండెక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ఏపీ అసెంబ్లీ లో కూడా స్పష్టంగా ఉందన్నారు.
అసెంబ్లీ రూల్స్ నెట్ లో ఉంటాయని వైసీపీ(YSRCP) అధ్యక్షులు, సలహాదారులు, ఎమ్మెల్యేలు, చూసుకుంటే ఎవరు ఎవరిని తప్పు దోవ పట్టిస్తున్నారనేది తెలుస్తుందన్నారు. ప్రతిపక్షానికి సమయం ఇవ్వట్లేదు అనేది అసత్యం అన్నారు. ప్రతిపక్షానికి ఎంత సమయం ఇవ్వాలి అనేది ఆ పార్టీల బలం బట్టి ఆ సమయం ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రతీ రోజూ క్వశ్చన్ అవర్ లో రెండు ప్రశ్నలు వైసీపీ వస్తున్నాయి. వాళ్ళు ఎవరు సభలో ఉండడం లేదని అన్నారు.
శాసనసభలో సభ్యతా, సంస్కరాలతో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఎక్కువ సమయం ఇచ్చే అవకాశాలు ఉంటాయని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో అసెంబ్లీ సమావేశాలు 68, 69 రోజులు మించి జరగలేదన్నారు. ప్రతిపక్షానికి సమయం కావాలంటే క్వశ్చన్ అవర్, జీరో అవర్, కాలింగ్ అటెన్షన్ వంటి అవకాశాలు ఉన్నాయన్నారు. మరింత సమయం కావాలన్నప్పుడు బిజినెస్( Business) అడ్వైజరి కమిటీ ని సంప్రదించాలని కోరారు. ఇప్పటికైనా సభలో మార్పు వస్తుందేమో అని ఆశిస్తున్నట్లు రఘురామకృష్ణంరాజు తెలిపారు.