Knife Attack | భార్య గొంతు కోసి…

Knife Attack | భార్య గొంతు కోసి…

Knife Attack | వెబ్ డెస్క్, ఆంధ్ర‌ప్ర‌భ‌ : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలోని ఆత్మకూరు (Atmakur) మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భార్యపై అనుమానంతో భర్త రవి కత్తితో దాడి (Knife attack) చేసి గొంతు కోశాడు. ఇటీవలే పంచాయతీలో సమస్యలు పరిష్కరించుకున్న దంపతుల మధ్య మళ్లీ గొడవలు పెర‌గ‌డంతో ఈ దారుణానికి దారితీసినట్లు తెలుస్తోంది.

ఇవాళ‌ తెల్లవారుజామున నిద్రిస్తున్న భార్యపై అనుమానంతో భర్త కత్తితో వివిధ భాగాలపై కోస్తూ గొంతుపై కూడా కత్తితో కోశాడు. ఆమె మేల్కొని కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు వచ్చి ఆమెను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ లో వరంగల్ లోని ఎంజీఎం హాస్పిటల్ (MGM Hospital) కు తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. మానస (Manasa) జిల్లాలోని ఓ సాంఘీక సంక్షేమ శాఖ గురుకుల పాఠశాలలో అటెండర్ గా పని చేస్తుందని స్థానికులు తెలిపారు. ఈ సంఘటన పై ఆత్మకూరు పోలీసులు సంఘటన చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply