ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు గౌహతీ వేదికగా కోల్‌తకతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో… రాజస్థాన్ బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కట్టారు. కోల్‌కతా స్పిన్ అటాక్‌కు ఆర్ఆర్ టాపార్డర్ కుప్పకూలింది.
కీలక బ్యాటర్లంతా స్వల్ప పరుగులకే వికెట్లు సమర్పించుకుంటున్నారు. 10.6వ ఓవర్లో మోయిన్ అలీ బంతికి నితిష్ రాణా (8) ఔటయ్యాడు. ఇప్పటికే జైస్వాల్ (29), సంజు (13), రియాన్ పరాగ్ (25), వానిండు హసరంగా (4) పరుగులకే వెనుదిరిగారు.
దీంతో రాజస్థాన్ జట్టు 11 ఓవర్లలో 82 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది.
ప్రస్తుతం క్రీజులో ధ్రువ్ జురేల్ – శుభమ్ దూబే ఉన్నారు.