KKR vs PBKS | కేకేఆర్ ఇన్నింగ్స్ కు వ‌ర్షం ఆటంకం !

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2025లో మరో మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించింది. కోల్‌కతాలో పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్‌కు వర్షం ఆటంకం కలిగించింది.

కోల్‌కతా జ‌ట్టు త‌మ సొంతగడ్డపై 202 పరుగుల భారీ లక్ష్యంతో ఛేదన‌కు దిగింది. అయితే, తొలి ఓవర్‌లోనే మ్యాచ్ కు బ్రేక్ ప‌డింది. స్టేడియంలో బలమైన ఈదురుగాలుల‌తో పాటు చినుకులు పడటంతో అంపైర్లు మ్యాచ్‌ను నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత గ్రౌండ్ సిబ్బంది పిచ్‌ను క‌వ‌ర్ల‌తో కప్పివేశారు.

ప్ర‌స్తుతం తొలి ఓవ‌ర్ ముగిసే స‌రికి కేకేఆర్ స్కోర్ 7/0. రహ్మానుల్లా గుర్బాజ్ (1), సునీల్ న‌రైన్ (4).

Leave a Reply