ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్‌లో మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. కాగా, ఈరోజు మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. ఈ సీజన్‌లో తమ ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవడానికి పంజాబ్ కింగ్స్ – కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగతున్న ఈ పోరులో టాస్ గెలిచిన.. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక కోల్‌కతా జట్టు ముందుగా బౌలింగ్ చేయనుంది.
జట్టు మార్పులు:
కోల్‌కతా నైట్ రైడర్స్: మోయిన్ అలీ, రమణ్‌దీప్ సింగ్ స్థానంలో రోవ్‌మన్ పావెల్, చేతన్ సకారియా జట్టులోకి వచ్చారు. కాగా, కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున రోవ్‌మన్ పావెల్, చేతన్ సకారియా ఈ రాత్రి అరంగేట్రం చేస్తున్నారు.
తుది జట్లు :
పంజాబ్ కింగ్స్ : ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శశాంక్ సింగ్, నెహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్.
కోల్‌కతా నైట్ రైడర్స్ : రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సునీల్ నరైన్, అజింక్యా రహానే (కెప్టెన్), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రోవ్‌మన్ పావెల్, వైభవ్ అరోరా, చేతన్ సకారియా, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.
ఇంపాక్ట్ ప్లేయర్స్
పంజాబ్ కింగ్స్: ముషీర్ అహ్మద్ ఖాన్, సూర్యాంశ్ షెడ్గే, హర్‌ప్రీత్ బ్రార్, వైషాక్ విజయ్‌కుమార్, ప్రవీణ్ దూబే.
కోల్‌కతా నైట్ రైడర్స్: అంగ్క్రిష్ రఘువంశీ, లువ్నిత్ సుజిత్ సిసోడియా, మనీష్ పాండే, అనుకుల్ రాయ్, అన్రిచ్ నోర్ట్జే.
వెనకబడిన రైడర్స్..
ఈ సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు వెనుకబడింది. ఎనిమిది మ్యాచ్ ల్లో మూడు విజయాలు, ఐదు ఓటములతో కోల్ కతా నైట్ రైడర్స్ 6 పాయింట్లతో 7వ స్థానంలో కొనసాగుతోంది.
మరోవైపు, గత సీజన్ విన్నింగ్ టీం జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యార్ కెప్టెన్సీలో… పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మంచి ఫామ్ లో ఉంది. ఆడిన 8 మ్యాచుల్లో 5 విజయాలు, 3 ఓటములతో 10 పాయింట్లతో 5వ స్థానంలో ఉంది పంజాబ్ జట్టు.
ఇదిలా ఉండగా, ఐపీఎల్ టోర్నమెంట్లలో కెకెఆర్ – పంజాబ్ 34 సార్లు తలపడ్డాయి. ఈ 34 మ్యాచ్‌లలో పంజాబ్ పై కెకెఆర్ దే పైచేయిగా ఉంది. కోల్‌కతా 21 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, పంజాబ్ 13 సార్లు గెలిచింది. మరి నేటి మ్యాచ్ లో కోల్ కతా పంజాబ్ పై తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుందా… లేక పంజాబ్ జోరుకు తలొగ్గుతుందా అనేది చూడాలి.