- 6 ఓవర్లలో స్కోర్ ఎంతంటే
ఈడెన్ గార్డెన్స్ వేదికగా లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ జట్టు విరుచుకుపడుతోంది. లక్నో నిర్దేశించిన 239 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో… కోల్‌కతా నైట్ రైడర్స్ ధీటుగా సమాధానమిస్తోంది.
దీంతో పవర్ ప్లేలో పరుగుల ప్రలయం సృష్టించారు కేకేఆర్ ప్లేయర్లు. కెప్టెన్ రహానే (15 బంతుల్లో 35), ఓపెనర్ నరేన్ (12 బంతల్లో 30) చెలరేగుతున్నారు. వచ్చిన బంతిని వచ్చినట్టే బౌండరీకి తరలిస్తూ.. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి ఏకంగా 90 పరుగులు సాధించారు.
కాగా, తొలి వికెట్‌గా క్వింటన్ డి కాక్ (9 బంతుల్లో 15) వెనుదిరిగాడు.