ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి

ఎర్రగట్టు జాతరలో సేవలందించిన వైద్యాధికారి
హసన్ పర్తి, ఆంధ్రప్రభ : కిట్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎర్రగట్టు వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల జాతర సందర్భంగా హసన్ పర్తి ప్రాధమిక ఆరోగ్య, వైద్యాధికారి రామ్ భార్గవ్ తో పాటు సిబ్బంది… భక్తులకు అందించిన వైద్య సేవలు మరువలేనివని కిట్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బొక్క కుమార్ కొనియాడారు. అనంతరం రామ్ బార్గవ్ ను,వైద్య సిబ్బందిని అధ్యక్షులు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు.
ఈసందర్భంగా బొక్క కుమార్ మాట్లాడుతూ… ప్రజల ప్రాణాలను కాపాడడంలో వైద్య సిబ్బంది సేవలు వెలకట్టలేమని అన్నారు. ఐదు రోజులపాటు కొనసాగిన ఎర్రగట్టు జాతరలో నిరంతరంగా విధి నిర్వహణలో పాల్గొన్న వైద్య సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. జాతర ప్రాంగణంలో విశేషంగా కృషి చేసిన వైద్య సిబ్బందిని సన్మానించడం తమకు గర్వకారణంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ మిత్రులు తోట సూర్యనారాయణ, గండ్రాతి రాంబాబు, కనపర్తి రమేష్, పొల్లాల శ్రీకాంత్ గౌడ్, మేకల ప్రకాష్, వీసం అనిల్ రెడ్డి గొర్రె రమేష్ తదితరులు పాల్గొన్నారు.
