Kite Festival | పండుగలతో అనుబంధాలు బలపడతాయి

Kite Festival | పండుగలతో అనుబంధాలు బలపడతాయి
- భూపాలపల్లిలో ఘనంగా కైట్ ఫెస్టివల్
- గాలిపటాలు ఎగరేసిన మాజీ ఎమ్మెల్యే గండ్ర
Kite Festival | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : పండుగల ద్వారా కుటుంబ అనుబంధాలు మరింత బలపడతాయని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ భూపాలపల్లి సుభాష్ కాలనీలోని మున్సిపల్ గ్రౌండ్ లో ఘనంగా కైట్స్ ఫెస్టివల్ నిర్వహించారు. ఈ ఫెస్టివల్ లో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి పాల్గొని పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేశారు. అనంతరం జంగేడు – భూపాలపల్లి గెట్ టు గెదర్ క్రికెట్ టోర్నమెంట్ టీషర్ట్ ఆవిష్కరించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో ఇలాంటి పండుగల పాత్ర ఎంతో ముఖ్యమని, పిల్లలు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని, ఇందులో పిల్లలతో గడిపిన ఈ క్షణం చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేశాయని తెలిపారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపి, ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త కాంతి నింపాలని కోరుతూ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొని సందడి చేశారు.
