Kishan Reddy | వైద్యుల కొరత తీరుస్తాం..

Kishan Reddy | వైద్యుల కొరత తీరుస్తాం..

  • సర్కారు ఆసుపత్రుల్లో ఇక అధునాతన వైద్య సేవలు
  • క్రిటికల్ కేర్ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Kishan Reddy | ఆంధ్రప్రభ బ్యూరో, ఉమ్మడి ఆదిలాబాద్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోందని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రి ప్రాంగణంలో రూ.21 కోట్ల బియ్యంతో నిర్మించిన క్రిటికల్ కేర్ ఆసుపత్రిని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి (Kishan Reddy) మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రూ. లక్షా 50 వేల కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధికి నిధులు వెచ్చించినట్లు తెలిపారు. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ కు రైల్వే లైన్, ఆదిలాబాద్ లో ఏర్పోర్ట్ నిర్మాణానికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.

Kishan Reddy

ఎమ్మెల్యే వెడమ బొజ్జు మాట్లాడుతూ… ప్రభుత్వ ఆసుపత్రుల్లో (Govt Hospital) పనిచేసే డాక్టర్లు కాసులకు కక్కుర్తి పడి బ్రోకర్లుగా పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసి రోగుల పట్ల కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ గోడెం నగేష్, ఎమ్మెల్యే పాయల శంకర్ మాట్లాడుతూ వెనుకబడిన అదిలాబాద్ జిల్లా అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేక నిధులు తెస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం వైద్యుల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా తీసుకొచ్చామన్నారు. ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడ్డ పేద రోగులకు నాణ్యమైన వైద్యం అందించాలని, బోత్, ఇచ్చోడ ఆసుపత్రిని ఆధునికీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దండే విట్టల్, ప్రిన్స్ డైరెక్టర్ రాథోడ్ జేసింగ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లెపూల న‌ర్స‌య్య, అద‌న‌పు కలెక్టర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

CLICK HERE TO READ భ‌ళా.. తెలుగు బాల‌లు!

CLICK HERE TO READ MORE

Leave a Reply