ప్రతి మహిళ సంతకం చేసేలా చదువుకోవాలి..

మంథని, ఆంధ్రప్రభ : ప్రతి మహిళ సంతకం చేసేలా చదువుకోవాలని, మహిళలు చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందుతుందని ఖానాపూర్ గ్రామ సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య పేర్కొన్నారు. మంథని మండలంలో ఉజ్వల స్కీం పథకం క్రింద నిరక్షరాస్యులు అయిన మహిళలకు అక్షరాస్యత పైన అవగాహన పెంచేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా ఆదివారం మంథని మండలం ఖానాపూర్ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ఉల్లాస్ నవభారత్ ఆధ్వర్యంలో మహిళా పొదుపు సంఘంలో మహిళలకు పరీక్షలు నిర్వహించారు.

ఈ పరీక్షలు మూడు విడతలో జరగనుండగా మొదటి విడత పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగెం అరుణ గట్టయ్య మాట్లాడుతూ సమాజ అభివృద్ధి మహిళల అక్షరాస్యత పైన ఆధారపడి ఉందని తెలిపారు. ఆడపిల్ల చదువు దేశానికి వెలుగు అని ఆమె సూచించారు. ప్రతి ఒక్కరూ కనీసం సంతకం చేసేలా అక్షరాస్యత పైన అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. మనం చదువుకోవడమే కాకుండా ఇతరులకు చదువు విలువ తెలుపలని ఆమె గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఖానాపూర్ గ్రామ సిఏ పుట్ట రవళ్య, అంగన్వాడి టీచర్ అమ్మకుంటి లక్ష్మీ, ఆయా పుట్ట రజిత, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply