Khanapur | వృద్ధ రైతుపై ఏఎస్ఐ దాష్టీకం

ఖానాపూర్ రూరల్ జూన్ 4 ఆంధ్రప్రభ న్యూస్ )ఖానాపూర్ మండలం పాతఎల్లాపూర్ లో నిర్వహించిన భూభారతి చట్టం రెవెన్యూ సదస్సులొ బుధవారం ఏఎస్సై రాంచందర్ ఓవర్ యాక్షన్ చేశారు. భూసమస్య చెప్పుకుందామని ఎమ్మా ర్వో ఛాంబర్ లోకి వెళ్లిన ఓ వృద్ధ రైతు అల్లేపు వెంకటిని బయటకి గెంటేశారు. లైన్ లో రాకుండా కాస్త ముందుకు వెళ్లాడని లాగేసిన ట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్కావడంతో సర్వత్రా విమ ర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు పాత ఎల్లాపూ ర్ లో వృద్ధ రైతు వెంకటిని లాక్కెళ్లిన ఏఎస్సై రాంచందర్ ని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల సస్పెండ్ చేశారు. ఈమేరకు ఉత్తర్వులు జారీచే శారు. రైతులపై అతిగా ప్రవరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఈ విషయమై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి రైతు ప్రభుత్వం అంటూ రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి. టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పోలీస్ ఎస్ఐ అధికారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు

Leave a Reply