చిన్నటేకూరు దుర్ఘటన కేసులో..

బస్సు యజమాని వేమూరి వినోద్‌కుమార్ అరెస్ట్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా ప్రజల మనసులను కలచివేసిన చిన్నటేకూరు దుర్ఘటన కేసు మరో కీలక దశలోకి అడుగుపెట్టింది. 19 మంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఆ ఘటనపై విచారణ వేగం పెంచిన పోలీసులు తమ దూకుడును మరింత పెంచారు. శుక్రవారం వి. కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్‌కుమార్‌ను అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ, నిందితుడిని కర్నూలు జీఎస్ఎఫ్ఎం కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు.

ఘటన వెనుక ఉన్ననిర్లక్ష్యం
గత నెల 24న జరిగిన ఈ ఘోర ప్రమాదం రాత్రి పూట కేవలం నిమిషాల్లోనే 19 కుటుంబాలను శోకసాగరంలో ముంచేసింది. చిన్నటేకూరు సమీపంలో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా అగ్నికి ఆహుతయ్యింది. రక్షణ చర్యలు చేపట్టేలోపే అగ్నికీలలు బస్సును పూర్తిగా చుట్టేశాయి. దురదృష్టవశాత్తు, ప్రయాణికులు లోపలే చిక్కుకుని కాలిపోయారు. ఈ ఘటనపై ప్రారంభ దశలోనే పోలీసులు దృష్టి సారించి, డ్రైవర్‌తోపాటు ట్రావెల్ యాజమాన్య నిర్లక్ష్యాన్ని కూడా విచారణలో భాగం చేశారు.
ప్రమాదం తర్వాత.. భద్రతపై పునర్విమర్శ
చిన్నటేకూరు ఘటన తరువాత కర్నూలు జిల్లాలో రవాణా శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా భారీ స్థాయిలో తనిఖీలు ప్రారంభించాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, పర్యాటక వాహనాలపై భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ పెరిగింది. ఫిట్నెస్ లేని వాహనాలు, అగ్నిమాపక పరికరాలు లేకుండా రోడ్లపై నడిచే బస్సులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి..
డ్రైవర్ తరువాత యజమాని.. చట్టం తన దారిలో
ప్రమాదం జరిగిన కొద్ది రోజులకే డ్రైవర్ లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే విచారణలో బయటపడిన వివరాలు మరింత సంచలనాత్మకంగా మారాయి. బస్సు భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, ప్రయాణికుల భద్రతా పరికరాలు లేకపోవడం, వాహనానికి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్ గడువు తీరిపోవడం, బస్సు రిజిస్ట్రేషన్ మూడు రాష్ట్రాలలో నమోదు చేయడం, నకిలీ సర్టిఫికెట్లతో డ్రైవర్ లైసెన్స్ పొందడం వంటి అంశాలు బయటపడ్డాయి. ఇవన్నీ బస్సు యాజమాని వేమూరి వినోద్‌కుమార్ బాధ్యతకే చెందుతాయని పోలీసులు గుర్తించారు. అదే ఆధారంగా, చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి, ఆయనను అరెస్ట్ చేశారు. ప్రజల ప్రాణాలకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ఉన్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టడం తప్పదు అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టం చేశారు.
ప్రమాదం తర్వాత భద్రతపై పునర్విమర్శ
చిన్నటేకూరు ఘటన తరువాత కర్నూలు జిల్లాలో రవాణా శాఖ, పోలీసు శాఖలు సంయుక్తంగా భారీ స్థాయిలో తనిఖీలు ప్రారంభించాయి. ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, పర్యాటక వాహనాలపై భద్రతా ప్రమాణాల పర్యవేక్షణ పెరిగింది. ఫిట్నెస్ లేని వాహనాలు, అగ్నిమాపక పరికరాలు లేకుండా రోడ్లపై నడిచే బస్సులపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
బాధిత కుటుంబాలకు న్యాయం.. సమాజానికి హెచ్చరిక
వేమూరి వినోద్‌కుమార్ అరెస్టు ఈ కేసులో కేవలం ఒక అడుగు కాదు.. అది ప్రాణ భద్రతను నిర్లక్ష్యం చేసిన ప్రతి వాణిజ్య యజమానికి ఒక హెచ్చరిక. రవాణా రంగంలో లాభం కోసం భద్రతను త్యజించే వారు ఇక చట్టం నుండి తప్పించుకోలేరన్న సందేశం ఈ చర్య ద్వారా వెలువడింది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ వ్యాఖ్యానించినట్లు, ప్రజల ప్రాణాల కంటే పెద్దదేమీ లేదు. భద్రతా ప్రమాణాలను పాటించని వారిపై ఎలాంటి క్షమాభిక్ష ఉండదు. చిన్నటేకూరు విషాదం ఒక జ్ఞాపకం మాత్రమే కాదు,అది భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేలా అందరికీ గుర్తు చేసే మేల్కొలుపు. ఇప్పుడు చట్టం తన దారిలో నడుస్తోంది, కానీ సమాజం మాత్రం ఒక ప్రశ్నతో నిలబడి ఉంది.. ప్రాణం కంటే వ్యాపారం పెద్దదా? అన్నది ఇక్కడ బేతాళ ప్రశ్నగా మిగిలింది.
రిమాండుకు తరలించిన కర్నూలు పోలీసులు
ఉలిందకొండ వద్ద రోడ్డు ప్రమాదం కు కారమైన బస్సు యాజమాన్యం వినోద్ కుమార్ ను అరెస్టు చేసిన పోలీసులు కర్నూలు జేఎఫ్సి కోర్టులో ఆయనను హాజరపరిచారు. ఈ కేసు విచారణ అధికారి అయిన పత్తికొండ డీఎస్పీ వెంకట రామయ్య ఈ కేసును క్షుణ్ణంగా విచారించిన అనంతరం కేసుకు సంబంధించి చార్జి షీట్ దాఖలు చేయడం జరిగింది. ఈ సంఘటనలో మొదటి నిందితుడైన మిరియాల లక్ష్మయ్యను 2025 అక్టోబర్ 28 తేదిన కర్నూలు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరుచగా, అదే విధంగా ఈ కేసు లో రెండవ ముద్దాయి వి కావేరీ ట్రావెల్స్ బస్సు ఓనర్ అయిన వేమూరి వినోద్ కుమార్ ను శుక్రవారం ఉదయం 07.30 గంటలకు కర్నూలు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం నిందితుని గౌరవనీయ కర్నూల్ జేఎఫ్ సి ఎం స్పెషల్ మొబైల్ కోర్టుఎదుట హాజరు పెట్టడం జరిగింది.
