ఎల్‌ఎన్ గార్డెన్‌లో కీలక సమావేశం..

మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ నియోజకవర్గ సాధన సమితి ఆధ్వర్యంలో ఏప్రిల్ 2న మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక ఎల్‌ఎన్ గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు.

ఈ సమావేశానికి మోత్కూర్, గుండాల, ఆత్మకూర్, అడ్డగుడూర్ మండలాలకు చెందిన అన్ని రాజకీయ పార్టీల నాయకులు, మేధావులు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు.

ఈ సందర్భంగా నియోజకవర్గ సాధన సమితి నూతన కమిటీ ఎన్నికతో పాటు భవిష్యత్ కార్యాచరణపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply