బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన హిస్టారికల్ కోర్ట్ డ్రామా ‘కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్’ థియేటర్లలో దుమ్మురేపుతొంది. కరణ్ సింగ్ త్యాగి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పటికే దాదాపు రూ.100 కోట్లు వసూలు చేసింది… ప్రస్తుతం నాల్గవ వారంలో హౌస్‌ఫుల్‌గా నడుస్తోంది.
హిందీ వెర్షన్ ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు, భారీ బాక్సాఫీస్ కలెక్షన్లను రాబట్టడంతో, ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి డబ్ చేసి మే 23న విడుదల చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదల కానుంది. దీంతో తెలుగు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ ఆసక్తి ఉంది.
ధర్మా ప్రొడక్షన్స్, లియో మీడియా కలెక్టివ్, కేప్ ఆఫ్ గుడ్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, జలియన్‌వాలా బాగ్ హత్యాకాండ తర్వాత బ్రిటిష్ రాజ్‌కు వ్యతిరేకంగా పోరాటం చేసిన ప్రముఖ న్యాయవాది సి శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. అక్షయ్ కుమార్, ఆర్.మాధవన్, అనన్య పాండే ప్రధాన పాత్రలలో… భావోద్వేగ సన్నివేశాలలో వారి నటనకు ప్రశంసలు అందుకున్నారు.