Kerala | శ్రీ అగస్త్య మహర్షి ఆలయంలో పవన్ ప్రత్యేక పూజలు
కేరళ : కేరళలోని కొచ్చి సమీపంలో ఉన్న శ్రీ అగస్త్య మహర్షి ఆలయాన్ని దర్శించుకున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఈసందర్భంగా ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ క్షేత్ర సందర్శనలో పవన్ కుమారుడు అకీరా, టీటీడీ సభ్యుడు ఆనందసాయి పాల్గొన్నారు. కాగా నేటి సాయంత్రం ఆయన తిరువనంతపురంలోని పరుశురామస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు.
