కేంద్రీయ విద్యాలయం సందర్శన

కేంద్రీయ విద్యాలయంలో సందర్శన
విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి తోడ్పాటు
కేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర కుమార్ రాయ్
పీఎంశ్రీ అమలు, సౌకర్యాలపై కేంద్రీయ విద్యాలయ పరిశీలన
నిజామాబాద్, ఆంధ్రప్రభ: కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పీఎం శ్రీ విద్యార్థుల సమగ్ర అభివృ ద్ధికి ఈ పథకం మరింత తోడ్పడాలని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ కేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర కుమార్ రాయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పీఎం శ్రీ పథకం అమలు, సౌక ర్యాలపై పరిశీలన నిమి త్తం కేంద్ర జాయింట్ సెక్రెటరీ దేవేంద్ర నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయం సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశా లలో అమలు చేస్తున్న స్మార్ట్ క్లాస్‌రూములు, డిజిటల్ ల్యాబ్‌లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ సదుపాయాలు, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రమైన శౌచాల యాలు, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయా లను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా విద్యా ర్థుల గణిత, విజ్ఞాన ప్రద ర్శనలను ఆసక్తిగా తిల కించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో చేపడుతున్న మొక్కల నాటడం కార్య క్రమం, పర్యావరణ పరిర క్షణ చర్యలు, విద్యార్థులు స్వయంగా చేపడుతున్న సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు ఆయనను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రకృతి పట్ల చూపు తున్న ఆసక్తి, సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణ అవగాహన పెంపొందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పీఎంశ్రీ పథకం ద్వారా చేపడుతు న్న పలు అభివృద్ధి కార్యక్ర మాలను వివరించారు. పాఠశాల నిర్వహణ, బోధ నా విధానాలు, విద్యార్థు లకు అందిస్తున్న సౌకర్యా లపై జాయింట్ సెక్రెటరీ సంతృప్తి వ్యక్తం చేస్తూ, పీఎం శ్రీ పథకం లక్ష్యాలను సక్రమంగా అమలు చేస్తు న్నందుకు అభినందనలు తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ వెంట రాష్ట్ర విద్యా శాఖ అధికారులు విజ యలక్ష్మి బాయి, శ్రీనాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, అధ్యాపకులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
