KCR’s HBD|కెసిఆర్ కి కేటీఆర్, హరీశ్ ల భావోద్వేగ శుభాకాంక్షలు
హైదరాబాద్: ఈరోజు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు ఎక్స్ (ట్విట్టర్) వేదిక కేసీఆర్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ప్రతి తండ్రీ తమ బిడ్డకు హీరో. నా తండ్రి నా ఒక్కడికే కాదు, తెలంగాణకు కూడా హీరో కావడం నా అదృష్టం. ఈ మాటకు ఆయన అర్థం ఏమిటో నిర్వచించారు కూడా..
ఒక కల కనడం, దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరడం! విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించడం! తెలంగాణ అనే కలను ప్రేమించడం, దాని కోసం పోరాడడం, మీ సొంత జీవితం గురించి కూడా ఆలోచించకుండా దానిని సాధించడం! మీరు గర్వంగా మీ కొడుకు అని పిలుచుకునే వ్యక్తి కావడమే నా ఏకైక లక్ష్యం! ఈ పోరాటానికి, ఈ రాష్ట్రానికి, ఈ వారసత్వానికి అర్హుడిగా ఉండటానికి నా జీవితంలోని ప్రతి క్షణం కృషి చేస్తానని మీకు నా వాగ్దానం చేస్తున్నా. ప్రేరణతో నిండిన జీవితానికి ధన్యవాదాలు! పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
జనం గుండెల్లో నిత్య సూరీడు మీరు – హరీశ్ రావు
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ” కేసీఆర్ తెలంగాణ ఉద్వేగం , కేసీఆర్ తెలంగాణ ఉద్రేకం, కేసీఆర్ తెలంగాణ స్వాభిమానం , కేసీఆర్ జై తెలంగాణ యుద్ధ నినాదం , కేసీఆర్ తెలంగాణ సమున్నత అస్తిత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజా ఉద్యమ పటుత్వం, కేసీఆర్ తెలంగాణ ఆవేశాల అగ్నితత్వం, కేసీఆర్ తెలంగాణ అనురాగాల అమృతత్వం, కేసీఆర్ తెలంగాణ ప్రజాగళం, కేసీఆర్ తెలంగాణ ఆత్మగౌరవ రణం, కేసీఆర్ తెలంగాణ నూతన రాష్ట్ర ఆవిష్కరణం, కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అభ్యుదయం, కేసీఆర్ తెలంగాణ జనం గుండెల్లో నిత్య సూర్యోదయం” అని తన ట్వీట్ లో తెలిపారు హరీష