నిజామాబాద్: ప్రజలు తిరస్కరించినా కేసీఆర్ లో మార్పు రాలేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ మాట్లాడారు. “కేసీఆర్ అవసరం రాష్ట్రానికి లేదని ప్రజలు తీర్పు ఇచ్చారు… చేసిందు చాలు… ఇక ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకోమ్మని కేసీఆర్ కు ప్రజలు చెప్పారు. కానీ, ఫామ్ హౌస్ లో కూర్చొని ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారు” అని సీఎం రేవంత్ ఆరోపించారు.
TG | ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ కుట్రలు.. రేవంత్
