KCR | మరోసారి కేసీఆర్ ఇంటికి పోలీసులు

KCR | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం విధితమే. అయితే హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి పోలీసులు మరోసారి చేరుకున్నారు. కేసీఆర్ ఇంటి పరిసరాలను పోలీసులు పరిశీలించారు. శుక్రవారం అక్కడే కేసీఆర్‌ను ప్రశ్నించే అవకాశం ఉందని తెలిపారు. సిట్ నోటీసులపై కేసీఆర్ కాసేపట్లో స్పందించనున్నట్లు సమాచారం. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
