KCR | కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు..

KCR | కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారు..

  • వైరా మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్టా కృష్ణార్జునరావు..
  • కే జీ సిరిపురం సర్పంచ్ ను సన్మానించిన బిఆర్ఎస్ నాయకత్వం..

KCR | వైరా, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పాలనపై విసుగుచెంది… రాష్ట్ర అభివృద్ధికై రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని… దానికి తార్కానమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపని వైరా మాజీ ఎంపీపీ వైరా మండల నాయకులు కట్టా కృష్ణార్జునరావు పేర్కొన్నారు.. శుక్రవారం బీఆర్ఎస్ తరపున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థులను కలిసి ఓటింగ్ సరళిని తెలుసుకొని, గెలుపొందిన అభ్యర్దికి ఘనంగా సన్మానం చేశారు… వైరా మండలంలో కేజీ సిరిపురం గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి శెట్టిపల్లి శ్రీనివాసరావు 153 ఓట్ల మెజారిటీతో గెలుపొందడంతో.. గెలుపొందిన శెట్టిపల్లి శ్రీనివాసరావును శాలువా కప్పి ఘనంగా సన్మానించారు.

KCR

ఈసందర్భంగా అయన మాట్లాడుతూ… మండలంలో బీఆర్ఎస్ పోటీ చేసిన స్థానాల్లో మంచి స్పందన ఉందని, తక్కువ మెజారిటీతో కొన్ని స్థానాలను కోల్పోయామని, విజయం దిశగా పోరాడిన ప్రతి ఒక్క అభ్యర్థికి ధన్యవాదాలు తెలిపారు.. అనంతరం వార్డు సభ్యులను ఘనంగా సన్మానించారు. అంతేకాక పార్టీ తరఫున కొద్ది ఓట్లతో ఓటమి పొందిన తాటిపూడి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు బట్ట భద్రయ్య గొల్లపూడి గ్రామంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరావుతో పాటు పాలడుగు రాయల కిరణ్ ను కలిసి ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఓటమికి గల కారణాలను తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వనమా విశ్వేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, పరుచూరి రామారావు, వైరా పట్టణ అధ్యక్షులు మద్దెల రవి, భూమాత కృష్ణమూర్తి, నూకల వాసు, వజీనేపల్లి చక్రవర్తి, దొంతుబోయిన వెంకటేశ్వరరావు, మోరంపూడి బాబు, వాసిరెడ్డి రవి,, జానీ, మట్టూరి కృష్ణారావు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply