ప్రభుత్వంపై కవిత మండిపాటు

ప్రభుత్వంపై కవిత మండిపాటు

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : రాష్ట్రంలో మరో ప‌ది రోజుల వ్యవధిలో ఖరీఫ్ సీజన్(Kharif season) వరి కోతలు ప్రారంభం కానున్నాయ‌ని, గ‌త ఏడాది స‌న్నవ‌డ్లు ఇచ్చిన రైతుల‌కు ఇంత‌వ‌ర‌కు బోన‌స్‌(bonus)లు ఇవ్వ‌లేద‌ని తెలంగాణ జాగృతి సంస్థ అధ్య‌క్షురాలు, ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత (MLC Kalwakuntla Kavitha) అన్నారు. సోష‌ల్ మీడియా వేదిక గా ప్ర‌భుత్వంపై ఆమె మండిప‌డ్డారు. బోనస్… బోగస్ అని విమ‌ర్శించారు.

సన్నవడ్లు పండించాలంటే రైతులకు ఎన్నో ప్రయాసలు, అదనపు పెట్టుబడి, అంతకు మించిన కష్టాలు పడ్డారని క‌విత అన్నారు. సన్నవడ్ల(Sannavadla)కు మాత్రమే బోనస్.. గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ సర్కారు (Congress Government) వంచనకు ప్రతిరూపమంటూ ఫైర్ అయ్యారు.

సర్కారు బోనస్ ఇస్తుందనే నమ్మకం సన్నవడ్లు సాగు చేసిన రైతులకు మళ్లీ కాంగ్రెస్ మార్క్ మోసమే ఎదురైందని ధ్వజమెత్తారు. సోనియమ్మ గ్యారెంటీకి కాంగ్రెస్ సర్కారు(Congress Govt.) మంగళం పాడేసిందని క‌విత ఆరోపించారు. రైతులకు బోనస్ (Bonus) ఇచ్చే వరకు వారి తరపున తెలంగాణ జాగృతి పోరాటాన్నికొనసాగిస్తుందన్నారు.

Leave a Reply