కస్తూరిబా విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక
తిమ్మాపూర్, ఆంధ్ర ప్రభ : తిమ్మాపూర్ కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం (Kasturba Gandhi Balikala Vidyalayam) విద్యార్థులు రాష్ట్రస్థాయి కళోత్సవాలలో థియేటర్ రోల్ ప్లే లో భాగంగా భారత రాజ్యాంగం అంబేద్కర్ చరిత్ర అనే అంశాన్ని ప్రదర్శించారు.
రాష్ట్రస్థాయిలో జరిగిన ఈ పోటీలో కేజీబీవీ తిమ్మాపూర్ విద్యార్థులు ప్రథమ బహుమతిని అందుకొని జాతీయస్థాయికి ఎంపిక కాబడ్డారు. ఈ సందర్భంగా రోల్ ప్లే విజేతలుగా లుగా నిలిచిన విద్యార్థులను పాఠశాల ప్రత్యేక అధికారి పడాల కిరణ్ జ్యోతి,ఉపాధ్యాయులు విద్యార్థులు అభినందించారు.

