Kashmir |ఆర్మీ హంట్ లో లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హ‌తం

జమ్మూ కాశ్మీర్‌లోని బందిపోరాలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబా (ఎల్‌ఇటి) టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి మరణించాడు. కాగా నేటి ఉద‌యం నుంచి ఉగ్రవాదులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అంతకుముందు బందిపొరా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా సిబ్బంది నిర్బంధ తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో జవాన్లను చూసిన ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులకు దిగారు. ముందుగా, భద్రతా దళాలు వెంబడిస్తున్న ఉగ్రవాదులలో ఒకరికి ప్రారంభ కాల్పుల్లో గాయాలయ్యాయని వర్గాలు తెలిపాయి. అదే ఎన్‌కౌంటర్‌లో, సీనియర్ అధికారి వ్యక్తిగత భద్రతా బృందంలోని ఇద్దరు పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. వారిని వెంట‌నే చికిత్స కోసం హాస్ప‌ట‌ల్ కు త‌ర‌లించారు.. ఉగ్ర‌వేట‌లో టాప్ క‌మాండర్ హ‌తం కావ‌డంతో ఆర్మీకి ద‌క్కిన తొలి విజ‌యంగా భావిస్తున్నారు.

Leave a Reply