గట్టుప్పలలో చలివేంద్రాన్ని ప్రారంభించిన కర్నాటి..

గట్టుప్పల, ఆంధ్రప్రభ : గట్టుప్పల మండల కేంద్రంలోని స్థానిక చౌరస్తాలో పద్మశాలి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం సోమవారం ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో నిత్యం పరిసర గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వస్తుంటారని, వారి దాహార్తిని తీర్చడానికి ఇలాంటి చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగ పడతాయని అన్నారు.

చలివేంద్రం ఏర్పాటు చేసిన పద్మశాలి యువజన సంఘం సభ్యులను అభినందించారు.ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు పున్న కిషోర్,గంజి కృష్ణయ్య, తిరందాసు రాములు,చెరిపల్లి సత్తయ్య,గంజి రాములు,కొంగరి కోటయ్య,కర్నాటి అబ్బయ్య, కర్నాటి వెంకటేశం,బావండ్ల శ్రీనివాస్,పున్న ఆనంద్, చిలుకూరి అంజయ్య,నారని జగన్,తిరందాసు ఆనంద్, దోర్నాల అమరేందర్,చెరిపల్లి కృష్ణ,ఏలె శివ శంకర్,పిశికె రాంబాబు,చెరిపల్లి నగేష్, చిలువేరు అయోధ్య,పగిళ్ళ హనుమంతు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply