Karnataka DGP Viral Video | వైరల్ వీడియో వివాదం: డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావుపై సస్పెన్షన్ వేట

Karnataka DGP Viral Video |

సీఎం సిద్ధరామయ్య ఆదేశాలతో తక్షణ సస్పెన్షన్
వీడియో తనది కాదని రామచంద్రరావు స్పష్టం
ఇది ఏఐతో తయారైన కుట్ర వీడియోనా?
రహస్య కెమెరా ఏర్పాటు వెనుక ఎవరు?
పెరుగుతున్న అనుమానాలు

Karnataka DGP Viral Video | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె. రామచంద్రరావు కార్యాలయంలో మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్న వీడియో ఒకట్రెండు రోజులుగా మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ విషయం బాగా వైరల్ కావడంతో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెంటనే ఆ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. ఒక బాధ్యత గల ప్రభుత్వోద్యోగిగా కె.రామచంద్రరావు నిబంధనలు ఉల్లంఘించారని ఈ ఉత్తర్వుల్లో పేర్కొనబడింది. సస్పెన్షన్ సమయంలో ఆయన హెడ్ క్వార్టర్స్ ని వదిలి ఎక్కడికీ వెళ్ళకూడదని కూడా ఆదేశాలు జారీచేయబడ్డాయి.

ఒక సీనియర్ పోలీసు అధికారి విధి నిర్వహణ సమయంలో పలువురు మహిళలతో సన్నిహితంగా ప్రవర్తించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.

ఈ వీడియోలో ఉన్నది తాను కాదని రామచంద్రరావు త్రోసిపుచ్చారు.. ఎవరో కుట్ర పన్ని ఏఐతో వీడియోని రూపొందించారని ఆరోపించారు.
అయితే, ఇదంతా ఒక ఎత్తయితే, ఈ వీడియోలను చూసినవారు, ఈ ఉదంతాన్ని గమనిస్తున్న వారిలో కొన్ని కొత్త సందేహాలు కలుగుతున్నాయంటున్నారు.
ఈ వీడియో హడావుడిగా చాటు నుంచి తీసినట్టు, అటూ ఇటూ షేక్ అవుతూ కాకుండా, స్టడీగా, ఒక చోటే కరెక్ట్ గా చూసి సెట్ చేసి, షూట్ చేసినట్టుగా ఉంది. అంటే, డీజీపీ లేని సమయంలో ఆ వ్యక్తి/వ్యక్తులు అక్కడ కెమెరాని పర్ ఫెక్ట్ గా సెట్ చేసారా? రామచంద్రరావు చర్యలు కూడా ఏ ఒక్కసారో సడెన్ గా కాకుండా చాలా సార్లు ఇలా జరిగి, ఇంకా జరుగుతాయని తెలిసి కెమెరా సెట్ చేసారా?. వారు ఖచ్చితంగా సిబ్బందిలోని వారేనా?వారు కెమెరాలు సెట్ చేస్తున్నప్పుడు అఫీషియల్ సీసీటీవీలో ఈ దృశ్యం రికార్డ్ అయినా, లేదా వారు షూట్ చేసిన వీడియోలు లీక్ చేసినా, తర్వాత ఎంక్వయిరీ చేసినా తామెవరో తెలిసి పోతుందని వారు ఊహించారా, లేదా? అసలు ఎవరు ఇదంతా రికార్డ్ చేసింది అనేది ఆసక్తి కరంగా మారింది..రామచంద్రరావు ఆరోపిస్తున్నట్టు ఇది ఏఐ వీడియో మాత్రం కాదని తెలిసి పోతోందంటున్నారు చాలా మంది.

ఇందులో మరో కోణం కూడా ఉందంటున్నారు. అంత పెద్ద అధికారి కార్యాలయంలోనే రహస్య కెమెరాలను అమర్చడం, చిత్రీకరించడం అంత సులభమా? అని ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.
ఇంతకీ ఆ కెమెరాలను అమర్చింది సిబ్బందిలోని వ్యక్తులేనా? ఎవరు? ఎందుకు? కేవలం సంచలనం కోసమేనా? రామచంద్రరావు ప్రతికూల వర్గం ప్రేరేపితమా? అన్నీ కాలమే సమాధానం చెబుతుంది.

click here for more

Borabanda | భార్యను రోకలిబండతో కొట్టి….

Leave a Reply