Karimabad | సైన్స్ ఫేర్ ప్రారంభం

Karimabad | సైన్స్ ఫేర్ ప్రారంభం
అధికారులతో కలిసి ప్రారంభించిన డీఈఓ రంగయ్య నాయుడు
Karimabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ జిల్లా సైన్స్ ఫెయిర్ వరంగల్ డీఈవో రంగయ్య నాయుడు, సైన్స్ అధికారి శ్రీనివాసరావు (Srinivasa Rao) ఇతర అధికారులతో కలిసి ప్రారంభించారు. తాళ్ల పద్మావతి ఇంటర్నేషనల్ కళాశాలలో గురువారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. విశేష ఆకర్షణగా విద్యార్థులచే తయారుచేసిన రోబోట్ (Robot) అతిథులకు స్వాగతం పలికి పూలబోకే అందజేయడం విశేషం.

జిల్లా (District) లోని పలు మండలాల హైస్కూల్, యుపిఎస్ ప్రైమరీ స్కూల్ పాఠశాల విద్యార్థులు వివిధ రకాల ఎగ్జిబిట్స్ తయారు చేసుకుని ప్రాంగణంలో ప్రదర్శిస్తున్నారు. ఎగ్జిబిట్ల ప్రదర్శనలో నూతన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల హెడ్మాస్టర్లు, సైన్స్ టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
