kareemabad | వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి

kareemabad | వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలి
- పాత ఉపాధి హామీ చట్టాన్ని పునరుద్ధరించి అమలు పరచాలి
- బికెయంయు జాతీయ కార్యవర్గ సభ్యుడు వెంకట్రాములు
kareemabad | కరీమాబాద్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపాధి కార్మికుల ప్రయోజనాలను కాలరాసే వీబీ జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేయాలని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ… ఎన్నోపోరాటాల ద్వారా వామపక్ష పార్టీల మద్దతుతో ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో 2005 లో సాధించుకున్న చట్టబద్ధమైన హక్కుగా ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి దాని స్థానంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గ్రామీణ పేదలకు ఉపాధి కూలీలకు తీరని అన్యాయం చేస్తూ రాష్ట్రాలపై పెనుభారాన్ని మోపే చట్టాన్ని చేయడం దుర్మార్గమన్నారు.
గ్రామీణ పేద ప్రజల పొట్టలు కొట్టి, భూస్వాముల వర్గాలకు ఊడిగం చేసేందుకే మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకోవడం సిగ్గుచేటన్నారు. వీబీ-జీ రామ్ జీ చట్టాన్ని రద్దు చేసి గత 20ఏళ్లుగా అమలవుతున్న ఉపాధి హామీ చట్టాన్ని అమలు పరచాలన్నారు. సంవత్సరంలో 200 రోజులు పనులు కల్పించి, రోజుకు కూలీ 800 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మికులు, రైతులు, గ్రామీణ పేదలు ప్రజా సంఘాలు సమైక్యంగా పోరాటాలు చేయాలని బికెయంయు జాతీయ సమితి ఇచ్చిన పోరాట కార్యక్రమాలను జయప్రదం చేయాలని వెంకట్రాములు పిలుపునిచ్చారు.
