Delhi | కన్యకా పరమేశ్వరి డాక్యుమెంటరీ ఆవిష్క‌రణ !

(ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో) : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు డిల్లీలోని తన కార్యాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి చరిత్ర డాక్యుమెంటరీని విడుదల చేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ ఆధ్వర్యంలో రూపొందించిన వాసవి అమ్మవారి డాక్యుమెంటరీని కేంద్రమంత్రి బుధవారం ఆవిష్కరించారు.

అమ్మవారి చరిత్రని తన చేతుల మీదుగా విడుదల చేయడం చాలా ఆనందదాయకంగా ఉందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు అమ్మవారి చరిత్రను తిలకించి హర్షం వ్యక్తం చేశారు. శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి చరిత్ర అహింస, స్త్రీల ఆత్మ గౌరవం వంటి విలువలకు నిదర్శనంగా నిలుస్తుంది ని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

వాసవి కన్యకాపరమేశ్వరి ఆశీస్సులతో అందరూ సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు.వాసవి మాత కరుణాకటాక్షాలతో ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు గంటి హరీష్, పార్థసారధి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *