టాలీవుడ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘కన్నప్ప’ మరో అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. విశ్వసనీయమైన కథాంశంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను ఇటీవల రాష్ట్రపతి భవన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించారు.
ఈ ప్రత్యేక ప్రదర్శనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, పలువురు కేంద్ర మంత్రులు, సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు హాజరై సినిమాను వీక్షించారు.
రాష్ట్రపతి ప్రసంశలు
సినిమా ప్రదర్శన అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందిస్తూ, భక్త కన్నప్ప చరిత్రను ఈ సినిమా ద్వారా మరోసారి తెలుసుకోవడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. నేటి యువతకు మన పౌరాణిక గాధలను గుర్తు చేసినందుకు చిత్ర యూనిట్‌ను ప్రత్యేకంగా అభినందించారు.