• గోదావ‌రి ఉగ్ర‌రూపం


రెంజ‌ల్ (నిజామాబాద్ జిల్లా) : గోదావ‌రి ఉప న‌దులు ఉప్పొంగి ప్ర‌వ‌హించ‌డంతో గోదావ‌రి ఉగ్ర‌రూపం దాల్చుతున్న‌ది. ఈ రోజు నిజామాబాద్ (Nizamabad) జిల్లా రెంజ‌ల్ మండ‌లంలోని కంద‌కుర్తి బ్రిడ్జి (Kandakurti Bridge) నుంచి వ‌ర‌ద నీరు ప్ర‌వ‌హం కొన‌సాగుతోంది. దీంతో కందకుర్తి నుండి ధర్మబాద్ వరకు రాకపోకలు నిలిచిపోయాయి. బ్రిడ్జి వైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా రెవెన్యూ, పోలీసు సంయుక్తంగా చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు.

మ‌హారాష్ట్ర (Maharashtra) లో బాబ్లీ, విష్ణుపురి ప్రాజెక్టుల నుంచి, అలాగే మంజీరా, హ‌రిద్ర‌, శ్రీ‌రాంసాగ‌ర్‌, నిజాంసాగ‌ర్ నుంచి నీరు గోదావ‌రిలో క‌లుస్తుంది. వరద నీటికి 1300 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా ప్రకారం వ్యవసాయ అధికారులు (Agricultural officers) లెక్కలు వేస్తున్నారు. సోయాబీన్ పంట 1150 నుండి 1200, కూరగాయలు 30 నుండి 40 ఎకరాలు, పత్తి పంట ఆరు ఎకరాలు, పెసర, మినుములు ఆరు ఎకరాలు, పసుపు మూడు ఎకరాల పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచ‌నా (Officials estimate) వేశారు. పంటల పై సమగ్ర విచారణ జరిపి బాధిత రైతుల‌ను ఆదుకోవాల‌ని ప్రగతిశీల రైతు కార్మిక సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పార్వతి రాజేశ్వర్ డిమాండ్ చేశారు.

Leave a Reply