Kanaka Pratibha | సర్పంచ్ ను సన్మానించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి

Kanaka Pratibha | సర్పంచ్ ను సన్మానించిన జిల్లా ఇంచార్జ్ మంత్రి

Kanaka Pratibha | జైనూర్, ఆంధ్రప్రభ : జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావును అదిలాబాద్ పెన్‌గంగా గెస్ట్ హౌస్ లో జైనూర్ మండలంలోని మర్లవాయి గ్రామపంచాయతీ సర్పంచ్ కనక ప్రతిభ మర్యాదపూర్వకంగా కలసి ధన్యవాదాలు తెలిపారు. మార్లవాయి గ్రామాన్ని గతంలో మంత్రి సందర్శించిన సందర్భంగా.. గ్రామ సమస్యలను అడిగి తెలుసుకొని, ప్రత్యేక అభివృద్ధికి మంత్రి జూపల్లి కృష్ణారావు నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపినట్లు మార్లవాయి గ్రామపంచాయతి సర్పంచ్ కనక ప్రతిభ పేర్కొన్నారు.

ఈసందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదివాసీ ఆత్మబంధువు ప్రొఫెసర్ హైమాండర్ అండ్ బెట్టి ఎలిజబెత్ వర్ధంతి సభకు జనవరి 11న హాజరవుతానని హామీ ఇవ్వడంతో పాటు, మార్లవాయి గ్రామపంచాయతీని సమగ్రంగా అభివృద్ధి చేయుటకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తామని తెలిపారని ఆమె పేర్కొన్నారు.

రెండవసారి సర్పంచ్‌గా విజయం సాధించిన ప్రతిభకు మంత్రి ఆత్మీయ సన్మానం చేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, తదితరులు పాల్గొన్నారని సర్పంచ్ తెలిపారు.

Leave a Reply