కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అలీ..

కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అలీ..
- దొంగ సారా అమ్మిన షబ్బీర్ అలీకి ఆస్తులు ఎక్కడివి…?
- దొంగలు దొంగలు కలిసి ఆస్తులు పంచుకున్నట్లు ఉంది
- షబ్బీర్ అలీ, గంప గోవర్ధన్ వస్తే మళ్లీ మాస్టర్ ప్లాన్, ప్రజా దర్భార్ లాంటివి పుట్టుకోస్తాయి
- ఫోన్ టాపింగ్, ఫార్ములా కేసులు ఎటుపోయాయి..!
- షబ్బీర్ ఆల్లి పై తీవ్రస్థాయిలో మండిపడ్డ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి
కామారెడ్డి ప్రతినిధి, ఆంధ్రప్రభ ; కామారెడ్డికి పట్టిన శని షబ్బీర్ అని, దొంగ సారా అమ్మిన షబ్బీర్ అలీకి ఆస్తులు ఎక్కడినుండి వచ్చాయని షబ్బీర్ అలీ తీరుపై కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఫైర్ అయ్యారు. కామారెడ్డి బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పదిమందికి ఆదర్శంగా ఉండాల్సిన నాయకుడు పర్మిషన్ లేకుండా ఇంటిని నిర్మించాడన్నారు. దొర, నవాబు, ఫకీర్ వేషం వేసుకొని మైనార్టీలకు సైతం న్యాయం చేయలేదన్నారు. తన పై తప్పుడు ఆరోపణలు చేసిన షబ్బీర్ అలీ దమ్ముంటే ఈద్గా, దర్గా సాక్షిగా తమ భార్య పిల్లలను తీసుకొని రావాలని, తాను సైతం కుటుంబంతో వస్తానన్నారు.
కళాశాలపై మాట్లాడిన షబ్బీర్ అలీ ఒక గజం అమ్మినట్లు చూపిస్తే, తాను గుండు, మీసం తీసుకుంటానని సవాల్ విసిరారు. కామారెడ్డిలో అంగూర్ తోట కబ్జా, ఫంక్షన్ హాల్ కబ్జా, గోడౌన్లకు పాస్ బుక్ కులు ఇవ్వకుండా వెనుక భాగాన్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తే ఓ రైతు చనిపోతే కనికరం లేకుండా షబ్బీర్ అలీ, గడ్డం చందు ఆ భూములను వెనకేసుకున్న చరిత్ర వారిది అన్నారు. మాస్టర్ ప్లాన్ లో భాగంగా తమ భూమి ఉన్న స్థలాన్ని మార్చి, కబ్జాలు సెటిల్మెంట్లకు కేరాఫ్ గా మారారన్నారు. మున్సిపల్ చైర్మన్ ఎన్నికల సమయంలో కైలా శ్రీనివాస్ గడ్డం చందు, మామిండ్ల లక్ష్మి, పిప్పిరి సుష్మాల వద్ద చైర్మన్ ల కోసం డబ్బులు తీసుకున్న చరిత్ర షబ్బీర్ అలీదే అన్నారు.
తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో సైతం తన వద్ద సైతం 18 లక్షలు తీసుకున్న చరిత్ర షబ్బీర్ అలీకి ఉందని అన్నారు. పురపాలక సంఘం ఎన్నికలలో గెలిచామని విర్రవీగుతున్న షబ్బీర్ అలి పదిమందికి ఆదర్శంగా ఉండాలి కానీ పక్కదారి పట్టించే ప్రయత్నం చేయొద్దన్నారు. శివునూర్ లో ఉన్న భూమి ఎవరిదని, హైదరాబాదులో 100 కోట్ల స్కాం చేసిన చరిత్ర షబ్బీర్ అలీదేనన్నారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డికి సైతం తెలియజేస్తానని తెలిపారు. ముస్లింలలో సైతం పేదవారికి తాను ఎల్లవేళలా అండగా ఉన్నానని, చేసిన సహాయం చెప్పుకోలేదన్నారు.
దొంగలు దొంగలు కలిసి ఉర్లు పంచుకున్నట్లు, దొంగకు దొంగకు తోడై ఆస్తులు అమ్మిన చరిత్ర షబ్బీర్ అలికే దక్కుతుంది అన్నారు. కామారెడ్డిలో అధికారులు అవినీతికి పాల్పడితే తాటతీస్తానని, లంచగొండితనం పోయి అధికారులు నిజాయితీగా పనిచేయాలన్నారు. వక్ఫ్ బోర్డు కోసం కోర్టుకు పోయింది నువ్వు కాదా అని, ఫోన్ టాపింగ్ కార్ ఫార్ములా కేసు ఎటుపోయాయని ప్రశ్నించారు. గూడెం శీను, పండ్ల రాజులకు ఏం చేశావని, నమ్ముకున్న వారిని వెన్నుపోటు పోటు పొడిచే రకం నీకే దక్కుతుందన్నారు. తాను కామారెడ్డి అభివృద్ధికి 40 కోట్లు తెచ్చిన ఏనాడు ఫోటోల కోసం, శంకుస్థాపనల కోసం ఫోజులు ఇవ్వలేదన్నారు.
సొమ్ముకొడిది, సోకొకడిది అన్న చందంగా మారిందని రమణ రెడ్డి తెలిపారు. కామారెడ్డిలో కబ్జాలు చేసే నువ్వు, మీ తమ్ముడి చరిత్ర ఆధారాలతో సహా తన వద్ద ఉందని రామరెడ్డి రోడ్డులో గల 26 ఎకరాలు బెదిరించి రిజిస్ట్రేషన్ చేసుకున్నది మీరు కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ లో షబ్బీర్ అలీ పక్కన ఉన్న ఏ ఒక్క కార్య కర్తను బాగుపడకుండా చేస్తున్నాడన్నారు. ఇందిరా చౌక్ లో విగ్రహం పెట్టడానికి 2 లక్షలు తీసుకున్నది వాస్తవం కాదా అని, నేను చెయ్యని తప్పులు ఆరోపిస్తే వీపు సున్నం చేస్తానన్నారు. కామారెడ్డి మున్సిపల్ సమావేశానికి సైతం మీడియాకు అవకాశం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు నరేందర్ రెడ్డి, మోటూరి శ్రీకాంత్, కుంట లక్ష్మారెడ్డి, సుజిత, యడారం ప్రియాంక, భాను ప్రకాష్, రాహుల్, ప్రీతి జైన్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.
