Kamareddy | చెరువులో ప‌డి ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు మృతి

కామారెడ్డి, ఆంధ్ర‌ప్ర‌భ : కామారెడ్డి జిల్లాలో ఉగాది ప‌ర్వ‌దినం నాడు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరువులో పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండల పరిధిలోని వెంకటాపూర్ అగ్రహారం గ్రామంలో చోటు చేసుకుంది.సంఘ‌ట‌న జ‌రిగిందిలా…వెంక‌టాపూర్ అగ్ర‌హారం గ్రామంలో చెరువు వ‌ద్ద‌కు మౌనిక త‌న పిల్ల‌ల‌తో క‌ల‌సి బట్టలు ఉతికేందుకు వెళ్లారు. పిల్ల‌లు గ‌ట్టుపై ఉంటుండ‌గా, ఆమె బ‌ట్ట‌లు ఉతుకుతున్నారు. ఇంత‌లో ఏమైందో తెలియ‌దు గానీ, మౌనిక (26)తోపాటు మైథిలి (10), వినయ్ (7), అక్షర (9)లు చెరువులో పడిపోయారు. ఈత రాక పోవ‌డంతో న‌లుగురు ప్రాణాలు విడిచారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

ప్ర‌మాదామా? హ‌త్య‌?

చెరువు ప‌డి ఒకేసారి న‌లుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘ‌ట‌న పై ప‌లు అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. కుటుంబాన్ని మౌనిక‌ భర్తే హత్య చేశాడంటూ మౌనిక తరఫు బంధువులు ఆరోపిస్తున్నారు. పిల్లలందరినీ పండుగకు హాస్టళ్లను నుంచి తీసుకొచ్చి పథకం ప్రకారమే చెరువులో నెట్టేసి హతమార్చాడంటూ ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు. అనుమానాస్ప‌ద మృతి కింద కేసు న‌మోదు చేసిని పోలీసులు వివ‌రాలు ఆరా తీస్తున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *