Kamareddy : ఆక్రోష సభను విజయవంతం…
కమ్మర్ పల్లి, ఆంధ్ర ప్రభ : 42 శాతం రిజర్వేషన్ సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నెల 15న తలపెట్టిన కామారెడ్డిలో బీసీ ఆక్రోష సభ(BC Akrosha Sabha)కు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు(BC, SC, ST, Minorities) అందరూ తరలి రావాలని రాష్ట్ర వ్యాప్త పిలుపు కొనసాగుతుంది.
అందులో భాగంగా ఈ రోజు కమ్మర్ పల్లి మండలంలోని అన్ని గ్రామాల్లోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఆహ్వానిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్న కమ్మర్ పల్లి మండల డీఎస్పీ, అధ్యక్షుడు నల్ల కైలాస్(Kailash), కమ్మర్ పల్లి మండల బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు మెరుగు నాగేశ్వర రావు, గుర్రం నరేష్, గుండోజి నవీన్ లు బీసీ ఆక్రోష సభ కరపత్రాలు పంచుతూ, బీసీ రిజర్వేషన్ల సాధన సమితి(BC Reservations Implementation Committee) ముఖ్య ఉద్దేశాన్ని, సభ ఉద్దేశాన్ని వివరిస్తూ ఈ నెల 15వ తేదీన కామారెడ్డి, సత్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించే బీసీ ఆక్రోష సభకు పెద్దఎత్తున తరలి వెళ్లి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

