ఉమ్మడి నల్లగొండ బ్యూరో, ఆంధ్రప్రభ : ఇటీవల కాలంలో పోక్సో కోర్టు (POCSO COURT) న్యాయమూర్తి (judge) రోజా రమణి ఇస్తున్న తీర్పులతో కామాంధులు హడలిపోతున్నారు. కామాంధుల భరతం పడుతున్న ఆమెపై సోషల్ మీడియా (social media)లో కూడా ప్రశంస జల్లులు కురుస్తున్నాయి. ఆడ పిల్ల తల్లిదండ్రులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ కామాంధుడికి 51 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సంచలనం తీర్పు ఇచ్చిన రోజా రమణి అందరి దృష్టిలో పడ్డారు. ఆ తర్వాత రెండు కేసుల్లో 20 ఏళ్లు ఒకరికి, 21 ఏళ్లు మరొకరి శిక్ష విధించారు.
తాజా తీర్పు…
కట్టంగూరు (Kattamguru)కు చెందిన జడిగల హరీష్ అనే కామాంధుడికి 21 ఏళ్ల జైలు శిక్ష, రూ.30,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు న్యాయమూర్తి రోజా రమణి తీర్పుఇచ్చారు. ఈ ఘటన 2019లో జరిగింది. అప్పట్లో కట్టంగూర్ పోలీస్ స్టేషన్ (police station)లో కేసు నమోదయింది. నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్ (SP Sarathchandra Pawar) నేతృత్వంలో న్యాయస్థానానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నిందితుడు తప్పించుకోలేకపోయారు.

