కన్నుల పండువగా కలశం ఊరేగింపు…

ఊట్కూర్, ఆంధ్రప్రభ ; నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో శ్రీరామనవమి వేడుకలు శుక్రవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఊట్కూర్ మండల కేంద్రంలో ని పాతపేట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

వేడుకల్లో భాగంగా ఉదయం ఆంజనేయస్వామి దేవాలయంనుండి సీతారాముల ఉత్సాహ విగ్రహాలను ఊరేగించగా మంగళ హారతులు డప్పు మేళ తాళాల మధ్య గోశాల ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్లి కలశం ఊరేగింపుగా దేవాలయానికి తీసుకువచ్చారు. గీతాంజలి పాఠశాల విద్యార్థులు చేపట్టిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.

సీతారాముల కళ్యాణం పురస్కరించుకొని ప్రతి ఏడాది మాదిరిగా ఎస్ ఎస్ కే సమాజం ఆధ్వర్యంలో సీతమ్మ రాములవారికి పట్టు వస్త్రాలు శ్రీ అంబాభవాని మాత దేవాలయం నుండి డప్పు మేళాల తాళాల మధ్య పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలుతీసుకువచ్చారు. అనంతరం ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణం ఉత్సవం అత్యంత వైభవంగా కొనసాగింది.

పురోహితుల ఆధ్వర్యంలో కళ్యాణం సాంప్రదాయబద్ధంగా వైభవంగా నిర్వహించారు. భక్తులు వేలాదిగా తరలివచ్చి కళ్యాణోత్సవాన్నితిలకించారు. గీతాంజలి పాఠశాల విద్యార్థులు దేవాలయ ప్రాంగణంలో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులనుఆలరించాయి. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాల వితరణ అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయస్వామి, సీతారాముల కళ్యాణం ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులుపాల్గొన్నారు.

Leave a Reply