హైదరాబాద్ – కిడ్నీ సమస్యతో బాధపడుతున్న వైసీపీ నేత ముద్రగడం పద్మనాభంను మెరుగైన వైద్యం కోసం నేడు హైదరాబాద్ కు తరలించారు. ఈ క్రమంలో కాకినాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను అక్కడి నుంచి డిశ్చార్జ్ చేశారు. కాకినాడ ఆసుపత్రిలో ఆయనకు డయాలసిస్ ట్రీట్మెంట్ చేశారు. కాగా, హైదరాబాద్ కు వెళ్లే ముందు కిర్లంపూడిలోని తన ఇంటికి వెళ్లాలని ఉందని ముద్రగడ కోరారు. దీంతో, ఆయనను కాకినాడ నుంచి కిర్లంపూడికి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర కొన్ని నిమిషాల పాటు ఆయన ఉన్నారు. ఈ సందర్భంగా ఆయనను బంధువులు, సన్నిహితులు, అభిమానులు పరామర్శించారు. త్వరగా కోలుకుని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.
మరోవైపు, ముద్రగడను ఎయిర్ అంబులెన్స్ ద్వారా హైదరాబాద్ కు షిఫ్ట్ చేయాలని తొలుత భావించారు. అయితే, దానికి ముద్రగడ అంగీకరించలేదు. దీంతో, రోడ్డు మార్గం ద్వారా ఆయనను అంబులెన్సులో హైదరాబాద్ కు తరలించారు. ఆయనను ఇక్కడ కార్పొరేట్ హాస్పిటల్ లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, చికిత్స కొనసాగుతున్నదని వెల్లడించారు వైద్యులు.
Cinema | నేడే హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ వేడుక – గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పోలీసులు
అంతకు ముందు కాకినాడలో ముద్రగడకు ట్రీట్మెంట్ అందించిన డాక్టర్ రాజా అమరేంద్ర (నెఫ్రాలజిస్ట్) మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభం కిడ్నీ వాపుతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారని, అందుకు సంబంధించి డయాలసిస్ ట్రీట్మెంట్ అందించామన్నారు. యూరిన్ కి సంబంధించి కూడా ఇబ్బంది ఉందని, ప్రస్తుతానికి ఆయన కోలుకున్నారని తెలిపారు. క్యాన్సర్ కి సంబంధించి ఇక్కడ ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదని, రెగ్యులర్ గా చెకప్ చేయించుకునే హాస్పిటల్ కి వెళ్తామని అనడంతో డిశ్చార్జ్ చేశామన్నారు.

