Kagar operation | ముగ్గురు మావోయిస్టులు మృతి

Kagar operation | ముగ్గురు మావోయిస్టులు మృతి
Kagar operation | ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) లో మరోసారి హింసాత్మక ఘటన చోటుచేసుకుంది. భద్రతాబలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పులు ఉద్రిక్తతకు దారితీశాయి.
ఇవాళ తెల్లవారుజామున సుక్మా జిల్లా గొల్లపల్లి అటవీ ప్రాంతంలో (Gollaplli Forest) మావోయిస్టుల కోసం స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుపడిన మావోయిస్టులు.. భద్రతా బలగాలపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఆ ప్రాంతంలో ఆపరేషన్ ఇంకా కొనసాగుతున్నదని అధికారులు వెళ్లడించారు.
