Kadem | శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం..

Kadem | శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవం..

Kadem | కడెం (నిర్మల్ జిల్లా), ఆంధ్రప్రభ : కడెం మండలంలోని లింగాపూర్ గ్రామంలో గల శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం 22వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 14వ తేదీ నుండి 16వ తేదీ వరకు వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తరిగంగాధర్ ఉపాధ్యక్షులు కసుల సతీష్, మాదాసు పెద్దోళ్ల నరసయ్య, కోశాధికారి బి రంజిత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి ముసుకు రాజేందర్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ అర్చకులు వెంకన్న పంతులు ఆధ్వర్యంలో ఈ నెల 15న ఆదివారం మధ్యాహ్నం స్వామి వారి కళ్యాణం ఉత్సవం రాత్రి 12 గంటలకు లింగోద్వాకాల విశేష పూజలు 16న సోమవారం ఉదయం 11 గంటలకు బద్ది పోచమ్మ బోనాలు అన్నదానం జాతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు, ప్రజలు తరలివచ్చి.. తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ వార్షికోత్సవానికి వస్తున్న భక్తులకు గ్రామ ప్రజలకు ఆలయం వద్ద అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని వారు పేర్కొన్నారు.

Kadem

Leave a Reply